Crime News: ఫోన్స్.. సోషల్‌ మీడియా వల్ల కుటుంబంలో కలహాలు రావడం అనేది ఈ మధ్య కాలంలో కామన్ విషయం అయింది. ఫోన్ ఎక్కువగా చూస్తుందని కొందరు.. ఫోన్ లో ఎక్కువ సమయం మాట్లాడుతున్నాడు అంటూ కొందరు తమ కుటుంబ సభ్యుల గురించి ఏదో ఒక ఫిర్యాదు ఉంటూనే ఉంది. ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియా రీల్స్ వల్ల మరింతగా గొడవలు పెరుగుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ వీడియోలు చూడటం లేదంటే చేయడం వల్ల ఎక్కువ సమయం వృదా అవుతుంది. దాంతో కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం సాధ్యం కావడం లేదు. అందుకే గొడవలు అనేవి మరింతగా పెరుగుతున్నాయి. ఇటీవల సొంత చెల్లిని రోకలి బండతో కొట్టి చంపిన ఘటన కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో చోటు చేసుకుంది. 


సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఇల్లెందు మండలం రాజీవ్ నగర్ తండాకు చెందిన సింధు అలియాస్ సంఘవి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అప్రెంటిస్ నర్స్ గా పని చేస్తోంది. సింధు డ్యూటీలో ఉన్నప్పుడు... డ్యూటీలో లేనప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు రీల్స్ చేస్తూ సోషల్‌ మీడియాలో షేర్ చేస్తూ ఉండేది. సింధు సరదాగా వీడియోలు చేయడం ఆమె అన్న హరిలాల్ కు నచ్చలేదు. 


దాంతో పదే పదే యూట్యూబ్‌ లో ఇతర సోషల్‌ మీడియా ప్లాట్ ఫామ్ ల్లో వీడియోలు షేర్‌ చేయవద్దు.. అసలు వీడియోలు పెట్టవద్దంటూ హెచ్చరించాడు. అనేక సార్లు హెచ్చరించినా కూడా ఆమె మాత్రం వినిపించుకోకుండా తాను అనుకున్నట్లుగానే చేసుకుంటూ వెళ్తుంది. దాంతో హరిలాల్‌ కోపం మరింతగా పెరిగింది.


Also Read:  Tulsi Plant: తులసి మొక్కకు రోజూ ఇలా చేస్తే మీరు కోటీశ్వరులవడం ఖాయం


నిన్న మరోసారి సింధు.. హరిలాల్ మధ్య ఈ విషయమై గొడవ పెరిగింది. పదే పదే చెప్పినా కూడా రీల్స్ చేయడం ఎందుకు మానడం లేదు అంటూ హరిలాల్ ప్రశ్నించాడు. అందుకు సింధు కాస్త ఘాటుగా సమాధానం చెప్పడంతో పాటు నువ్వు ఏం చేసినా కూడా నేను రీల్స్ చేయడం మానేయను అంటూ సమాధానం చెప్పిందట. దాంతో హరిలాల్ కోపోద్రిక్తుడై ఏకంగా ఇంట్లో ఉన్న రోకలి బండతో చెల్లి సింధు తలపై కొట్టాడు. 


ఒక్కసారిగా కుప్పకూలిన సింధు ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపు తీవ్ర రక్తస్రావం అవ్వడంతో కోమాలోకి వెళ్లింది. మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం కు తరలిస్తూ ఉండగా సింధు మార్గం మధ్యలో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి హరిలాల్‌ ను అరెస్ట్‌ చేశారు. మొదట సింధు రాయి తగిలి కింద పడి చనిపోయిందని కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ గ్రామస్తులను పోలీసులు ఎంక్వౌరీ చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. హరిలాల్‌ కూడా తన నేరంను ఒప్పుకున్నాడు.


Also Read: Motorola Edge 40 Price: రూ. 1,299లకే కర్వ్డ్ స్క్రీన్ కలిగిన Motorola Edge 40..కేవలం పరిమితకాల ఆఫర్‌ మాత్రమే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి